Bollywood: రామ్ సేతు కోసం రెడీ అవుతున్న అక్ష‌య్‌..

Bollywood: బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రామ్ సేతు తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి అభిషేక్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో.. చంద్ర ప్ర‌కాశ్ ద్వివేది స‌మ‌ర్ప‌ణ‌లో కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స‌, అబండంటియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ అయోధ్య రామ జ‌న్మ‌భూమిలో ప్రారంభం కాగా.. తాజాగా రామ్ సేతు నుంచి అక్ష‌య్ కుమార్ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఇందులో అక్ష‌య్ పురావ‌స్తు శాస్త్రవేత్త‌గా క‌నిపించ‌నున్నారు.

Ramsethu

భార‌త్‌- శ్రీ‌లంకను క‌లిపే రామ సేతు వంతెన నేప‌థ్యంలో భార‌తీయ సంస్కృతి, చారిత్రక వార‌స‌త్వ మూలాల ఆధారంగా యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇక ఈ చిత్రంలో అక్ష‌య్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ , నుష్రాత్ భ‌రుచ్ఛా హీరోయిన్ల్‌గా న‌టిస్తున్నారు. ఇక ఈ రోజు ఈచిత్ర షూటింగ్‌లో అక్ష‌య్ పాల్గోంటున్నాడు.. ఈ మేర‌కు ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపాడు.