Corona Virus: మాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌కు క‌రోనా.. బాలీవుడ్‌లో క‌రోనా విజృంభ‌ణ!

Corona Virus: క‌రోనా వైర‌స్ దేశంలో మ‌ళ్లీ విజృంభిస్తున్న నేప‌థ్యంలో క‌రోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుల నుంచి ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌హారాష్ట్రలో భారీగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. అన్నీ న‌గ‌రాల్లో కంటే ముంబైలోనే ఎక్కువ‌గా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో బాలీవుడ్‌లో క‌రోనా విజృంభిస్తుంది.. ప‌లువురు బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో పాటు ర‌ణ్‌బీర్ క‌పూర్‌, మ‌నోజ్ బాజ్‌పాయి, కార్తీక్ ఆర్య‌న్‌, ప‌రేశ్ రావెల్ వంటి బాలీవుడ్ సెలెబ్రీటీస్ క‌రోనా బారిన ప‌డ్డారు.

cine Industry

కాగా తాజాగా దంగ‌ల్ న‌టి ఫాతిమా స‌నా షేక్ క‌రోనా బారిన ప‌డింది. 29ఏళ్ల స‌నా ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించింది.. అలాగే కార్తీ ఖైదీ, ద‌ళ‌ప‌తి విజ‌య్ మాస్ట‌ర్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపాడు లోకేశ్‌.. త‌న‌కు క‌రోనా వ‌చ్చింద‌ని.. కొన్నిరోజులుగా త‌న‌తో క‌లిసిన వారు త‌ప్ప‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండండి. ప్ర‌స్తుతం ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లుగా కూడా ఆయ‌న పేర్కొన్నాడు.‌