ఆ హీరోయిన్ని ప్రేమిస్తున్నా…

మెగాహీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో గ్రాండ్ డెబ్యు ఇచ్చాడు. మెగా హీరోల్లో ఏ హీరోకి కూడా ఇంత మంచి డెబ్యు రాలేదు. ఆసి పాత్రలో అద్భుతంగా నటించిన వైష్ణవ్ తేజ్, రెండో సినిమాని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నాడు. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ పార్ట్ ఎప్పుడో కంప్లీట్ అయ్యి ఓటిటిలో ధియేటర్ లో కానీ విడుదలకి కూడా రెడీ అవుతోంది. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన ఈ మెగా హీరో తాజాగా లైవ్ లో అభిమానులతో ఫన్ చాట్ చేసాడు. ఈ ఇంటరాక్షన్ సెషన్ లో తనకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు అనగానే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా అని చెప్పాడు. ఇక్కడితో ఆగకుండా వైష్ణవ్, సోనక్షి అంటే ఇష్టమే కాదు ఆమెని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అతని వాల్ పేపర్ కూడా సోనక్షి సిన్హానే ఉండడం విశేషం. ప్రముఖ నటుడు శత్రుజ్ఞ సిన్హా కూతురు అయిన సోనక్షి, సల్మాన్ దబాంగ్ మూవీతో డెబ్యు ఇచ్చంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసి టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగింది. ఇక ఫేవరెట్ హీరో ఎవరు అనే ప్రశ్నకి వైష్ణవ్ తేజ్, తనకి సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఇష్టమని చెప్పి ఫాన్స్ కి షాకిచ్చాడు. సోనక్షి సిన్హా, రజినీకాంత్ కలిసి లింగా మూవీ చేశారు. మరి ఇద్దరు నచ్చిన మనుషులు కలిసి చేసిన ఈ మూవీని వైష్ణవ్ తేజ్ ఎన్ని సార్లు చూసాడో.