సూపర్ స్టార్ శ్రీ రజినీకాంత్ గారికి మా హృదయ పూర్వక అభినందనలు – తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ( TFPC )!!

సౌత్ ఇండియా సూపర్ స్టార్ హీరో శ్రీ రజినీకాంత్ గారికి 2020 సంవత్సరానికి భారత ప్రభుత్వం “దాదాసాహెబ్ ఫాల్కే” అవార్డు ని ప్రకటించింది. ఆయనకు ప్రభుత్వం ఈ అవార్డు ద్వారా ఇచ్చిన గౌరవానికి, ఆయన ఇండియా, జపాన్, సింగపూర్, మలేసియా వంటి ఎన్నో దేశాలకు సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నందుకు మేము సంతోషం వ్యక్తపరుస్తున్నాం. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మరియు ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున, మా సూపర్ స్టార్ శ్రీ రజినీకాంత్ గారికి మా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.

టి.ప్రసన్నకుమార్-మోహన్ వడ్లపట్ల
గౌరవ కార్యదర్శి – గౌరవ కార్యదర్శి