RRR: ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్‌ను ద‌క్కించుకున్న ర‌వితేజ మూవీ నిర్మాత‌..

RRR: ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో కొమురంభీంగా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, బ్యూటీ ఆలియాభ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ త‌దిత‌రులు ఈRRR చిత్రంలో న‌టించ‌నున్నారు. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న ప్ర‌పం‌చ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ RRR సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలు ఉన్నందున ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ఎల‌క్ట్రానిక్, డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్ధ పెన్ స్టూడియోస్ ద‌క్కించుకున్నారు.

Pen Studios

ఈ మేర‌కు మూవీ టీం ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. జ‌యంతిలాల్ గ‌డ ఆధ్వ‌ర్యంలోని పెన్ స్టూడియోస్ సంస్థ‌.. ఈ చిత్రం నార్త్ థియేట్రిక‌ల్ రైట్స్‌తో పాటుగా అన్ని భాష‌ల్లో ఎల‌క్ట్రానిక్‌, డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కులు తీసుకున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఇక పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై మాస్ మ‌హారాజా ర‌వితేజ ఖిలాడి చిత్రం రూపొందుతుంది.