నాని OTT బాటలోనే రామ్, సాయి తేజ్?

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన నాని 25వ సినిమా V రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు అనేక రకాల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఒక క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్ ఇప్పుడు మాత్రం ఆ రూమర్స్ పై స్పందించింది లేదు. దీంతో గాసిప్స్ కూడా నిజమయ్యేలా ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి.

అయితే నాని లాంటి హీరోనే అంత పెద్ద సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు అంటే అదే బాటలో రామ్, సాయి ధరమ్ తేజ్ కూడా నడవాల్సిందే అనే టాక్ కూడా వస్తుంది. రామ్ నటించిన రెడ్ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక సాయి సోలో బ్రతుకే సో బెటర్ కూడా ఎప్పుడో రిలీజ్ కి సిద్ధమైంది. అందరికి కామన్ గా కరోనా దెబ్బ పడడంతో నష్టాల భారిన ఓడకుండా OTTలో వచ్చిన ధరకు సినిమాని విడుదల చేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.