ఫోర్బ్స్ టాప్ 10నటులలో అక్షయ్ కుమార్ న్యూ రికార్డ్

బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ తన కెరీర్ లో మరో రికార్డును అందుకున్నాడు. ఫోర్బ్స్ యొక్క టాప్ 10 వరల్డ్స్ హై-పెయిడ్ యాక్టర్ జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. సినిమాల ఎంపికల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆలోచించి బాక్సాఫీస్ హిట్స్ అందుకునే అక్షయ్ కుమార్ 48.5 మిలియన్ల ఆదాయంతో టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక బాలీవుడ్ స్టార్ గా నిలిచాడు.

అతను ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన లిస్ట్ లో అతని ఆదాయంలో ఎక్కువ భాగం యాడ్స్ ద్వారా వచ్చిందట. అక్షయ్ తన బాలీవుడ్ స్టార్స్ ని వెనక్కి నెట్టడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టార్స్ విల్ స్మిత్, జాకీ చాన్ వంటి హాలీవుడ్ తారలను కూడా ఓడించాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న డ్వేన్ జాన్సన్ 87.5 మిలియన్ డాలర్లు సంపాదించాడు. మరో స్టేట్ ర్యాన్ రేనాల్డ్స్ 71.5 మిలియన్ డాలర్లతో 2 వ స్థానంలో నిలిచాడు. మార్క్ వాల్బెర్, బెన్ అఫ్లెక్, విన్ డీజిల్ వరుసగా $58, $55, $54 మిలియన్లను సంపాదించి 3వ, 4వ మరియు 5వ స్థానంలో నిలిచారు.