బిపాసా బసు-కరణ్ సింగ్.. డేంజరస్ ఫిక్స్!

దాదాపు ఐదు సంవత్సరాల తరువాత బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు మళ్ళీ నటనతో బిజీ అవుతోంది. ఈసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో గుర్తింపు దక్కించుకోవాలని బిపాసా డిసైడ్ అయ్యింది. డేంజరస్ అనే వెబ్ సిరీస్ కోసం తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో జాతకట్టింది. ఇక ఈ సిరీస్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రమోట్ చేయడానికి ఎలాంటి విషయాన్ని వదిలిపెట్టడం లేదు.

టీజర్ పోస్టర్స్ అనే కాకుండా తెరవెనుక జరిగిన ఆనందమైన క్షణాలను కూడా ఆడియెన్స్ తో పంచుకుంటోంది. ఈ బ్యూటీ సోషల్ మిడియాలోనే హైపర్యాక్టివ్‌గా ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో సిరీస్‌కి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను షేర్ చేసుకుంది. తన భర్తతో బిపాసా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు క్లియర్ గా అర్ధమవుతోంది కొన్ని రొమాంటిక్ ఫొటోస్ ఉండగా మరికొన్ని స్టిల్స్ లలో బిపాసా తన గ్లామర్ డోస్ ని పెంచింది. ఇక డేంజరస్ వెబ్ సిరీస్ ఆగష్టు 14న డిజిటల్ వరల్డ్ MX ప్లేయర్ లోకి రానుంది.