Orey Bujjiga: V, డర్టీహరిని మించిన బుజ్జిగాడు

Orey Bujjiga: లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో చాలా సినిమాలు OTTలో విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్లు క్లోజ్ కావడంతో.. ప్రేక్షకులు కూడా ఓటీటీలకు అలవాటు పడిపోయారు. ఓటీటీలో విడుదలయ్యే మంచి సినిమాలను ఆదరించారు. లాక్‌డౌన్‌లో చాలా తెలుగు సినిమాలు ఓటీటీలో విడుదలవ్వగా.. అందులో చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సినిమాలు మాత్రమే బాగానే ఆకట్టుకున్నాయి.

OREY BUJJIGA COLLECTIONS

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన ‘V’ సినిమా లాక్‌డౌన్‌లో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవ్వగా.. ఇది పరాజయం పాలైంది. అయితే లాక్‌డౌన్‌లోనే ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఒరేయ్ బుజ్జిగా(Orey Bujjiga) సినిమా హిట్ అయింది. ఇక డర్టీహరి సినిమా కూడా ఫరవాలేదు అనిపించింది.

కానీ లాక్‌డౌన్ తర్వాత ఈ మూడు సినిమాలను థియేటర్లలో విడుదల చేయగా.. ఒరేయ్ బుజ్జిగా సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. వి సినిమా రూ.16 లక్షల షేర్ వసూలు చేయగా.. డర్టీహరి రూ.15 లక్షల షేర్ రాబట్టింది. అయితే ఒరేయ్ బుజ్జిగా సినిమా ఏకంగా రూ.25 లక్షల షేర్ వసూలు చేసింది.