Tamannaah Bhatia:కెరీర్ అయిపోయిందన్నారు… మౌనంగానే భరించా

Tamannaah Bhatia:మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో టాలీవుడ్‌లో తమన్నా అడుగుపెట్టినా.. ఈ సినిమాతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత విడుదలైన హ్యాపీడేస్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో అక్కడి నుంచి వరుసపెట్టి ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోల అందరి సరసన నటించి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

TAMANNA ABOUT CINEMA CAREER

ఇక తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్‌గా Tamannaah Bhatia గుర్తింపు పొందింది. అయితే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో ఎదుర్కొన్న అవమానాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ మిల్కీ బ్యూటీ బయటపెట్టింది. కెరీర్ మెదట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నానని, తన కెరీర్ ఇక అయిపోయిందని కూడా చాలామంది చాలాసార్లు కామెంట్ చేశారంది. వాటిని మౌనంగానే భరించి ఆత్మవిశ్వాసంతో కొనసాగానంది.