ఒక చిన్న విరామం ట్రైలర్ కు అద్భుతమైన స్పందన

మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సందీప్ చేగురి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘ఒక చిన్న విరామం’. సంజయ్ వర్మ , గరీమ సింగ్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు, బిగ్ బాస్ కంటెస్టెంట్ పునర్నవి భూపాళం ,నవీన్ నేని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం థ్రిల్లర్ కథాంశంతో ఉత్కంఠగా సాగుతుంది. ఒక మంచి సందేశం ఉన్న ఈ చిత్రం అందరూ కొత్త కళాకారులతో తెరకెక్కబడింది. రోడ్ ప్రయాణంలో సాగే కథ ఇది, డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాగుతుందని ,ఈ నవంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని మొదటి పాట ఇటీవల విడుదలై పాపులర్ అయ్యింది. అక్కినేని అమల ఈ సాంగ్ ను విడుదల చేశారు.

నవంబర్ 2న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే, సందీప్ చేగురి ఈ సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సంజయ్ వర్మ తన నటనతో ఆకట్టుకోబోతున్నాడు. రోహిత్ బుచ్చు సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. ఒక చిన్న విరామం చిత్రాన్ని అక్కినేని నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో ప్రమోట్ చెయ్యడం విశేషం. పునర్నవి హౌస్ లో ఉండగా నాగార్జున ఈ చిత్రం గురించి ప్రస్తావించడం జరిగింది.