టైగర్ ష్రాఫ్ గర్ల్ ఫ్రెండ్ కి సూపర్ ఛాన్స్ ఇచ్చిన సల్మాన్ ఖాన్

2015లో వ‌రుణ్‌తేజ్, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన `లోఫ‌ర్‌`తో సినీ రంగ ప్ర‌వేశం చేసిన బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టాని.. త‌ర్వాత అవ‌కాశాలు రాలేదో.. లేక ఈ అమ్మ‌డు టాలీవుడ్‌లో ఇక చాలని అనుకుందో ఏమో కానీ.. బాలీవుడ్‌లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. మ‌హేంద్ర సింగ్ బ‌యోపిక్ ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాతో బ్రేక్ సంపాదించుకుంది. త‌ర్వాత జాకీ చాన్ కుంగ్ ఫూ యోగ చిత్రంలో న‌టించింది. టైగ‌ర్ ష్రాఫ్‌తో న‌టించిన భాఘి 2 సూప‌ర్‌డూప‌ర్ హిట్ సాధించ‌డంతో దిశాకు మంచిపేరొచ్చింది.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రాధే సినిమాలో నటిస్తున్న దిశా పటాని, గతంలో భారత్ మూవీలో కూడా కీ రోల్ ప్లే చేసింది. ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. సల్మాన్ లాంటి స్టార్ హీరో పక్కన, సోలో హీరోయిన్ గా నటించనుండడం దిశా కెరీర్ కి స్టార్ స్టేటస్ అందించేలా ఉంది. అలాగే టైగ‌ర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచింది. మ‌రి కేవ‌లం సినిమాలు, భాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ అనే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ దిశా, సోష‌ల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోల‌తో కుర్ర‌కారుకు హీటెక్కిస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంది.