తెలుగు అయిపొయింది ఇప్పుడు తమిళ సినిమాపై పడ్డారు

ప్రభాస్ కెరీర్‌ని మలుపు తిప్పిన మూవీ వర్షం. ఈ సినిమాకు రీమేక్‌గా బాలీవుడ్‌లో బాఘి మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాఘీ సిరీస్‌లో వ‌చ్చిన రెండో పార్ట్ తెలుగు సినిమా క్ష‌ణంకి రీమేక్‌గా తెరకెక్క‌గా, మూడో పార్ట్ ఏ చిత్రాన్నితీసుకోని రీమేక్‌ చేస్తారో ఆని ఆసక్తి నెలికొంది. ఇక మూడో సీక్వెల్‌లో కూడా హీరోగా టైగర్ ష్రాఫ్ నటించబోతున్నాడు. శ్ర‌ద్ధా క‌పూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.

మాధవన్ ఆర్య కలిసి నటించిన వెట్టై సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఇదే మూవీని తెలుగులో నాగ చైతన్య, సునీల్ కలిసి తడాకాగా తెలుగు ప్రేక్షకుల ముందుకి తెచ్చారు. టాలీవుడ్ లో కూడా ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీనే టైగర్ ష్రాఫ్ బాఘి 3గా చేస్తున్నారు. సునీల్ పాత్రలో రితేష్ దేశముఖ్ నటిస్తున్నాడు. అహ్మ‌ద్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో సాజిద్ న‌డియావాలా ఈ చిత్రాన్న నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020 మార్చి 6న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి తెలుగు తమిళ ప్రేక్షకులని మెప్పించిన ఈ సినిమా, బాఘీ మూడో సీక్వెల్ గా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.