‘చౌడప్ప నాయుడి’గా జూనియర్ ఎన్టీఆర్

స్ట్రైలిష్ స్టార్ అల్లున్‌తో తీసిన ‘అల వైకుంఠపురములో’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం RRR షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉండగా.. త్వరలోనే త్రివిక్రమ్ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశముంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.

NTR-TRIVIKRAM MOVIE TITLE

త్రివిక్రమ్ అనేక మంది హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే హీరోయిన్ పేరుని ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. దీనికి ఒక పవర్‌ఫుల్ టైటిల్ పెట్టినట్లు సమాచారం. అదే చౌడప్ప నాయుడు. కథకు సూట్ అవుతుందనే ఉద్దేశంతో చౌడప్ప నాయుడు టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.