వైరల్‌గా మారిన కోహ్లీ కూతురి ఫొటో

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులకు నిన్న ఆడబిడ్డ జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో ప్రకటించాడు. ఈ సందర్భంగా విరుష్క దంపతులకు పలువురు ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే నిన్న విరాట్ కోహ్లీ తన కూతురి ఫొటోను మాత్రం బయట పెట్టలేదు.

KOHLI DAUGHTER PHOTO VIRAL

ఇవాళ కోహ్లీ త కూతురి ఫొటోలను సోషల్ మీడియాలో బయటపెట్టాడు. కోహ్లీ సోదరుడు వికాస్ పాప కాళ్ల ఫొటోలని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇంట్లోకి ఏంజెల్ వచ్చిందని, పట్టరానంత సంతోషంగా ఉందని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అనుష్క శర్మ డెలివరీ కోసం ఆస్ట్రేలియా సిరీస్ నుంచి కోహ్లీ మధ్యలోనే ఇండియాకి తిరిగి వచ్చారు.