NTR: నాట్యం టీజ‌ర్.. మూవీ టీంకు అభినంద‌న‌లు తెలిపిన ఎన్టీఆర్‌!

NTR: ప్ర‌ముఖ కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నాట్యం చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను సంధ్యారాజు స్నేహితురాలైనా కొణిదెల ఉపాస‌న రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో సంధ్యారాజు ఎంతో ఆక‌ట్టు కుంది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ను యంగ్ టైగ‌ర్ NTR ఎన్టీఆర్ తో రిలీజ్ చేయించారు చిత్ర‌బృందం.

Natyam teaser

నాట్యం చిత్రంలో న‌టించిన ప్ర‌ముఖ కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజుకు మంచి గుర్తింపు రావాల‌ని, ఈ చిత్రం మంచి విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు NTR ఎన్టీఆర్‌. దీంతో ఎన్టీఆర్‌కు చిత్ర‌బృందం త‌ర‌పున ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇప్పుడు ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఇక ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం క్లైమాక్స్ షూట్‌లో బిజీగా ఉన్నాడు. అనంత‌రం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న డైరెక్ష‌న్‌లోNTR ఎన్టీఆర్ చేయ‌నున్నాడు.‌