నితిన్ నుంచి క్రేజీ అప్డేట్

హీరో నితిన్ ప్రస్తుతం చెక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలలో నటిస్తోంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై భవ్య ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండగా.. సంపత్ రజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

nithin check trailer

ఫిబ్రవరి 19న ఈ సినిమాని విడుదల చేయనుండగా. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. రేపు సాయంత్రం 6.30 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.