Rakul: మ‌రో బాలీవుడ్ సినిమాకు ఓకే చేసిన‌ ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌..

Rakul: ఫిట్‌నెస్ భామ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది‌. ప్ర‌స్తుతం ఆమె వ‌రుస సినిమాల‌తో బిజీబిజీగా గ‌డుపుతుంది. తాజాగా ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం మేడే. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్, అమితాబ్ బ‌చ్చ‌న్‌లు ప్ర‌ధాన పాత్ర‌లుగా పోషిస్తున్నారు. అలాగే అజ‌య్ దేవ‌గ‌ణ్, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న థ్యాంక్ గాడ్ సినిమాలోనూ హీరోయిన్‌గా న‌టిస్తుంది ర‌కుల్‌ Rakul.

Rakulpreethsingh

ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో హిందీ మూవీకి ఓకే చెప్పింది. ఆయుష్మాన్ ఖురానా జోడీగా హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ కొట్టేసింది Rakul ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌. ఈ సినిమాకు టైటిల్ డాక్ట‌ర్ జి ఖ‌రారు చేసిన‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థ జంగిల్ పిక్చ‌ర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలుపుతూ.. త‌మ బృందంలోకి Rakul ర‌కుల్‌ను ఆహ్వానిస్తూ పోస్ట్ చేశారు. ఈ చిత్రం పూర్తి కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతుంద‌ని.. అనుభూతి క‌శ్య‌ప్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ర‌కుల్ స్పందిస్తూ.. ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం క‌ల్పించిన జంగిల్ పిక్చ‌ర్స్ నిర్మాణ సంస్థ‌కు, డైరెక్ట‌ర్ అనుభూతి క‌శ్య‌ప్‌కు ధ‌న్య‌వాదాలు.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా అన్న ఆత్రుత‌తో ఉన్నాన‌ని Rakul ర‌కుల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.