బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కి కోర్టు సమన్లు

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాల్లో ఉంటూ ఉంటుందనే విషయం తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఆమె.. ఇప్పుడు మరో వివాదాంతో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని నెపోటిజంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే.

court summons kangana ranout

ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఒక కోటరీ ఉందని, అందువల్ల సినీరంగంలో కొత్తవాళ్లను ఎదగనివ్వరని, రచయిత జావేద్‌ అక్తర్‌ అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కంగనా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కంగనాపై జావేద్ ఆక్తర్ పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు కంగనాను పోలీసులు సంప్రదించగా.. విచారణకు ఆమె సహకరించలేదు. దీంతో జావేద్ దీనిపై కోర్టుకు వెళ్లగా.. విచారణకు సహకరించాలని కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సమన్లు జారీ చేసింది.