అరియానా సీక్రెట్స్ బయటపెట్టిన సోదరి నైనా

బిగ్‌బాస్-4తో పాపులర్ అయిన అరియా గ్లోరీ ఇప్పటివరకు హౌస్‌లో ఉండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ పేరు తెచ్చుకుంది. ఎవరి హెల్ప్ తీసుకోకుండా తన గేమ్ తాను ఆడుతుంది. సేఫ్ గేమ్ కాకుండా జెన్యూన్‌గా అరియానా గేమ్ ఆడుతుందని పలుమార్లు నాగార్జున కూడా మెచ్చుకున్నాడు. అరియానా బాగా ఆడుటుందని, ఇలాగే ఆడాలని నాగార్జున పలుమార్లు సూచించాడు. దీంతో టాప్-5లో అరియానా ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. ఫస్ట్‌లో అరియానాను చూసి ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండదు అనుకున్నారు. కానీ తన గేమ్‌తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రేక్షకుల ఓట్లను అరియానా సంపాదించుకుంటోంది.

ARIYANA

అయితే తాజాగా ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరియానా సీక్రెట్స్‌ను ఆమె సోదరి నైనా గ్లోరీ వెల్లడించింది. ప్రతిఒక్కరి లైఫ్‌లో లవ్ స్టోరీలు, బ్రేకప్‌లు కామన్ అని, తన అక్క అరియానా లైఫ్‌లో కూడా ఎవరైనా ఉండొచ్చంది. పరోక్షంగా అరియానాకు లవ్ స్టోరీ ఉండొచ్చని చెప్పిన నైనా.. మిగతా వివరాలను మాత్రం వెల్లడించలేదు. అక్క కూకట్ పల్లిలో ఉండేదని, అక్కకు, తనకు సరదాగా గొడవలు జరుగుతూ ఉండేవని చెప్పింది.

తాను జాబ్ చేస్తానని, అందుకే అక్కకతో కాకుండా ఆఫీస్‌కు దగ్గరలోనే ఉంటానని నైనా చెప్పింది. తమ కుటుంబం చాలా ఇబ్బందులు పడిందని, తినడానికి సరైన తిండి లేక దొడ్డు బియ్యం తిన్న రోజులు కూడా ఉన్నాయని నైనా చెప్పింది.