సునీల్ డైరెక్షన్‌లో సినిమా

ఎన్నో సినిమాలతో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సునీల్.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరోగా రెండు, మూడు సినిమాలు హిట్ అయినా.. ఆ తర్వాత వరుసగా సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో మళ్లీ కమెడియన్‌గా సినిమాల్లోకి నటించేందుకు ఆసక్తి చూపిన సునీల్.. ఇప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన కలర్ ఫొటో సినిమాలో విలన్‌గా నటించి సునీల్ మంచి పేరు తెచ్చుకున్నాడు.

SUNIL

అల్లు అర్జున్-సుకుమార్ డైరెక్షన్‌లో రానున్న పుష్ప సినిమాలో కూడా సునీల్ విలన్‌గా నటించనున్నాడని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కమెడియన్, హీరో, విలన్‌గా నటించిన సునీల్.. ఇప్పుడు దర్శకుడిగా కూడా మారనున్నాడట. ప్రస్తుతం హీరోగా వీఎన్ ఆధిత్య డైరెక్షన్‌లో సునీల్ ఒక సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు మరో రెండు సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తున్నాడు.

దీని తర్వాత సునీల్ ఒక మరాఠీ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సన్నిహితుడితో కలిసి సునీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడమే కాకుండా నిర్మించనున్నాడట. ఆ సినిమాలో హీరోగా సునీల్ నటించనున్నాడట. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.