ఒక రోజు ముందే వచ్చిన అప్డేట్…

బాలయ్య బాబు మాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసిన సినిమాలు సింహ, లెజెండ్. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. హిట్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన ఈ కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో సినిమా అఖండ. అఘోరాగా బాలయ్య నటిస్తున్న ఈ మూవీ టైటిల్ రోర్ ని ఏప్రిల్ 13న రిలీజ్ చేశారు. అతితక్కువ కాలంలోనే 54 మిలియన్ వ్యూస్ రాబట్టిన అఖండ మూవీ నందమూరి అభిమానుల్లోనే కాక సినీ అభిమానుల్లో కూడా అంచనాలు పెంచింది. సీనియర్ హీరో సినిమాల్లో 50 మిలియన్ టచ్ చేసిన ఏకైక టీజర్ అఖండ మాత్రమే. పుష్ప తర్వాత తెలుగు టాప్ వ్యూవర్ షిప్ సాధించిన ఈ టీజర్ ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శ్రీకాంత్​ విలన్​గా నటిస్తుండగా… ప్రగ్యాజైస్వాల్​, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా బాలయ్య బర్త్ డే సంధర్భంగా అఖండ మూవీ టీమ్ మరో పోస్టర్ ని విడుదల చేసింది. జూన్​ 10న బాలయ్య పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఒకరోజు ముందుగానే పిక్​ రావడంతో ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు. సాంగ్ లోని స్టైల్ నుంచి రెడీ చేసిన ఈ పోస్టర్ లో బాలయ్య రాజసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆయన మీసం తిప్పిన విధానం, ఫేస్ లో నవ్వు చూస్తే అఖండ హిట్ కల కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది.