కాస్త ఆగండి అన్నీ మేమే చెప్తాము…

గబ్బర్ సింగ్ తో బాక్సాఫీస్ రికార్డులని తిరగరాసిన కాంబినేషన్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ కలయిక మరోసారి తెరపై దుమ్ము లేపడానికి సిద్ధమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ మూవీ క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీర మల్లు ప్రాజెక్ట్ అయ్యాక సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అయ్యింది. దీంతో పాటు సత్య దేవ్ తిమ్మరుసు పోస్టర్ ని పవన్ కళ్యాణ్ తో ఎడిట్ చేసి ఫ్యాన్స్ నెట్ లో హల్చల్ చేశారు. ఫేక్ న్యూస్ వైరల్ అవుతుండడంతో మేకర్స్ PSPK28 గురించి అఫీషియల్ గా ఒక అప్డేట్ ఇచ్చారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ ని ఉగాదిని రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు కానీ కరోనా కారణంగా పోస్ట్ పోన్ చేశామని… సరైన సమయంలో ఎలాంటి అప్డేట్ అయినా అఫీషియల్ గానే అనౌన్స్ చేస్తాము అని మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ పోస్ట్ ని రిపోస్ట్ చేసిన హరీష్ శంకర్, టైటిల్ పై ఏవేవో అనుకోకండి ఫైనల్ చేసిన అసలైన అదిరిపోతుంది వెయిట్ చేయండి అని కోట్ చేశాడు. స్టూడెంట్స్, పాలిటిక్స్ చుట్టూ తిరిగే ఈ పవర్ ఫుల్ కథకి బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం అనే కాన్ఫిడెన్స్ మెగా అభిమానుల్లో ఉంది. మరి మరో గబ్బర్ సింగ్ లా ఈ PSPK28 ఫస్ట్ లుక్ ఎప్పుడు బయటకి వస్తుందో చూడాలి.