ఇది కదా క్రాక్ ఎక్కించే అప్డేట్ అంటే…

;నందమూరి బాలకృష్ణ బర్త్ డే సంధర్భంగా అఖండ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి మైత్రి మూవీ మేకర్స్ స్వీట్ సర్ప్రయ్స్ ఇచ్చారు. స్టార్ హీరోలతో వరస బెట్టి ప్రాజెక్ట్స్ చేస్తున్న ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి బాలకృష్ణ కొత్త సినిమా అప్డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. క్రాక్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టడమే కాకా సరైన సినిమా పడితే తెలుగు సినీ అభిమానులు థియేటర్స్ కి వస్తారు అని ప్రూవ్ చేసిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇదివరకే ఈ ప్రాజెక్ట్ గురించి అందరికీ ఒక క్లారిటీ ఉన్నా కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇప్పుడే వచ్చింది. బాలయ్య పుట్టిన రోజు సంధర్భంగా రేపు ఉదయం 8 గంటల 45 నిమిషాలకి ఈ మూవీ నుంచి పోస్టర్ కానీ టైటిల్ అనౌన్స్మెంట్ కానీ రాబోతుంది. ఈ విషయాన్నీ ట్వీట్ ద్వారా తెలియజేసిన మైత్రి మూవీ మేకర్స్, రాయల్టీ మీట్స్ ఫెరోసిటీ అంటూ కోట్ చేశారు. NBK 107గా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ పై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. అఖండ తర్వాత బాలయ్య నుంచే వచ్చే సినిమా కావడం క్రాక్ లాంటి కమర్షియల్ సక్సస్ అచ్చిన గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయడమే ఈ అంచనాలకి కారణం. పైగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కాబట్టి ఈ NBK 107ని కావాల్సినంత ప్రమోట్ చేస్తారు. మరి ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఏముంది? నందమూరి అభిమానుల కోసం గోపీచంద్ మలినేని అండ్ మేకర్స్ ఏం దాచిపెట్టారు అనేది తెలియాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.