ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తీపికబురు అందించింది. రెండు రోజుల పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూడవచ్చని తెలిపింది. 5,6వ తేదీల్లో ఎలాంటి డెబిట్, క్రెడిట్ కార్డు డీటైల్స్ ఇవ్వకుండా నెట్‌ఫ్లిక్స్‌లో ఉచితంగా సినిమాలు చూడవచ్చని వెల్లడించింది. ఇండియన్ యూజర్లకు మాత్రమే ఈ ఫ్రీ స్ట్రీమింగ్ ఆఫర్ ఇస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
ఈ ఆఫర్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ క్యాటలాగ్‌లోని సినిమాలు, షోలు, డాక్యుమెంటరీలను ఫ్రీగా చూడొవచ్చని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. మొబైల్‌లో అయితే నెట్‌ఫ్లిక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయి ఫ్రీగా సినిమాలు చూడవచ్చంది. ఇక డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లో నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి ఫ్రీ సర్వీసులను పొందవచ్చని తెలిపింది.
ఇండియాలో అమెజాన్ ప్రైమ్ కంటే నెట్‌ఫ్లిక్స్‌కు ఎక్కువమంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. దీంతో సబ్‌స్రైబర్లను మరింత మందిని పెంచుకోవడంలో భాగంగా ఈ ఫ్రీ ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం, లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీలు బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ఓటీటీలలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో విడుదల అవుతున్నాయి. దీంతో ఓటీటీ మార్కెట్ ఇప్పుడు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది.