షోలో ఏడ్చేసిన పవన్ మాజీ భార్య

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, హీరోయిన్‌గా రేణు దేశాయ్ తెలుగు వారందరికీ పరిచయమైన వ్యక్తే. పవన్‌తో కలిసి పలు సినిమాలో నటించిన రేణూదేశాయ్.. ఆ తర్వాత పవన్‌ను ప్రేహ వివాహం చేసుకుంది. కొద్ది సంవత్సరాల తర్వాత పవన్‌తో విడాకులు తీసుకున్న రేణూదేశాయ్ ప్రస్తుతం పిల్లలతో కలిసి జీవిస్తోంది. గత కొద్దిరోజుల క్రితం రెండోపెళ్లి చేసుకోబోతున్నట్లు రేణుదేశాయ్ సోషల్ మీడియాలో వెల్లడించగా.. దీనిపై పవన్ అభిమానులు విమర్శలు కురిపించారు.

RENU DESAI

అయితే తాజాగా బుల్లితెర స్టార్ యాంకర్ సుమ నిర్వహిస్తున్న ఈట్ విట్ సుమక్క అనే ప్రొగ్రామ్‌కు రేణూదేశాయ్ వచ్చింది. సుమక్క అనే యూట్యూబ్ ఛానెల్‌లో సుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికి గెస్ట్‌గా హాజరైన రేణూదేశాయ్.. ఎన్నో సరదా సంగతులు పంచుకుంది. ఈ సందర్భంగా రేణూ భావేద్వేగానికి గరైంది. రేణు బర్త్ డే సందర్భంగా బెస్ట్ మామ్ ఎవర్ అని రాసిన ఉన్న కప్‌ని సుమ గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ కప్‌పై ఉన్నఅకీరా, ఆద్య ఫొటో చూసి రేణూ భావేద్వేగానికి గురై ఏడ్చేసింది.

తన పిల్లలు ఎప్పుడైనా ఫంక్షన్స్‌, పవన్ కల్యాణ్ షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, ఇతర నటీనటులు ఫోన్ చేసి ఆద్య, ఆకీరా చక్కగా ఉన్నారని, మీ పిల్లలతో అందరితో కలిసిపోతున్నారని చెప్పినప్పుడు ఒక తల్లిగా తనకెంతో సంతోషంగా అనిపిస్తుందని రేణూ దేశాయ్ చెప్పింది.