బిగ్‌బాస్-4కు టాలీవుడ్ స్టార్ హీరో

బిగ్‌బాస్-4 మరో కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ వీక్ ఒకరు, వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ అవ్వనుండగా.. మిగతా ఐదుగురు ఫైనల్ వీక్‌కు చేరుకుంటారు. అఖిల్, సోహైల్, అభిజిత్, మోనాల్, హారికలు టాప్-5లో ఉండే అవకాశముందని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడ్డాయి. ఇక ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, వచ్చే వారం అరియానా బయటికి వచ్చే అవకాశముందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అభిజిత్ విన్నర్ అయ్యే అవకాశముందని, రన్నర్‌గా అఖిల్ లేదా సోహెల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే అఖిల్ ఇటీవల బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను గెలిచి డైరెక్ట్‌గా ఫైనల్ వీక్‌కి చేరుకున్నాడు.

B9IGBOSS4

అయితే బిగ్‌బాస్-4 గ్రాండ్ ఫినాలేకు సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్‌గా వస్తున్నట్లు సమాచారం. గత సీజన్లలో గెస్ట్‌లుగా వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఈ సారి మహేష్ బాబు చీఫ్ గెస్ట్‌గా వస్తే అది బిగ్‌బాస్ ప్రేక్షకులకు పండగే అని చెప్పవచ్చు. ఇప్పటికే బిగ్ బాస్ టీఆర్‌పీ రేటింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో గ్రాండ్ ఫినాలేను ఎంతో గ్రాండ్‌గా నిర్వహించాలని బిగ్‌బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా మహేష్ బాబును చీఫ్ గెస్ట్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాల చేస్తున్నారు.

గత సీజన్ల కంటే ఈ సీజన్‌కు రేటింగ్స్ బాగా తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకని డిసెంబర్ 7 నుంచి రాత్రి 10 గంటలకు షోను ప్రసారం చేయాలని బిగ్‌బాస్ నిర్వాహకులు యోచిస్తున్నారు, శనివారం, ఆదివారం మాత్రం రాత్రి 9 గంటలకే ప్రసారం చేయనున్నారు.