నెల్లూరు కుర్రాళ్లు మళ్లీ ఇరగదీశారు…

నెల్లూరు కుర్రాళ్లు అనగానే సినిమాల్లోని ఇరగదీసే ఫైట్స్ గుర్తు వస్తాయి. కాటమరాయుడు సినిమాలోని ఫైట్ తో మొదలైన ఈ కుర్రాళ్ల ప్రస్థానం సూపర్ స్టార్ మహేశ్ బాబు భరత్ అనే నేను మూవీలోని లీలా మహల్ ఫైట్ తో పీక్ స్టేజ్ కి వెళ్లింది. సరిగ్గా కెమెరా కూడా లేని నలుగురు కుర్రాళ్ళు సినిమా స్థాయికి తగ్గకుండా ఫైట్స్ ని తెరపైన చూసినట్లే మళ్లీ చేసి చూపించడం అందరినీ ఆకట్టుకుంది. చివరగా క్రాక్ మూవీలోని వేటపాలెం ఫైట్ ని రీ క్రియేట్ చేసి 1.8 మిలియన్ వ్యూస్ రాబట్టిన నెల్లూరు కుర్రాళ్లు మరో ఫైట్ తో ముందుకి వచ్చారు.

ఈసారి బాక్సాఫీస్ షేక్ చేసిన వకీల్ సాబ్ తో కావడం విశేషం. ఎప్పుడూ సినిమాలో ఉన్నట్లే ఫైట్ ని చేసి చూపించే ఈ కుర్రాళ్లు వకీల్ సాబ్ ట్రైన్ ఫైట్ ని మాత్రం కాస్త మార్చి చేశారు. ట్రైన్ లేకపోవడంతో అండర్ కంస్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ లో చేశారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ దింపేశారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే మిస్సింగ్ కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్. ఒక్క రోజులోనే 740k వ్యూస్ రాబట్టిన ఈ ఫైట్ ని మీరు కూడా చేసేసి లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి.