సీజన్-5 టూ పార్ట్స్ టు రిలీజ్ డేట్స్…

నెట్ఫ్లిక్స్ ని ఇండియన్ సినీ అభిమానులకి దెగ్గర చేసిన సిరీస్ ఏదైనా ఉందా అంటే కళ్లు మూసుకోని మనీహీస్ట్ అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ మేకింగ్, థ్రిల్లింగ్ ట్విస్ట్స్ లో వచ్చిన ఈ సిరీస్ నిజానికి నెట్ ఫ్లిక్స్ వాల్యూనే కాదు మేకింగ్ స్టాండర్డ్స్ ని కూడా పెంచింది. ఇప్పటికే రిలీజ్ అయిన 4 సీజన్స్ హైయెస్ట్ వ్యూవ్స్ అందుకున్నాయి. ప్రొఫెసర్ గ్యాంగ్ కి బాగా ఎట్రాక్ట్ అయిన అభిమానులను సీజన్ 5 కోసం ఎదురు చూస్తున్నారు. హై వోల్టేజ్ కంటెంట్ రెడీ చేసిన మేకర్స్ ఈ సీజన్ 5 రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సీజన్ 5ని రెండు పార్ట్శ్ గా విడుదల చేయనున్నారు. ఇందులో ఫస్ట్ పార్ట్ ని సెప్టెంబర్ 3న, సెకండ్ పార్ట్ ని డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నారు. వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతున్న ఈ డేట్ అనౌన్స్మెంట్ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.