మార్వెల్ ‘ETERNALS’ సూపర్ హీరోస్ లో ఏంజిలీనా జోలీ

మార్వెల్ నుంచి వచ్చే సూపర్ హీరో సినిమాలకి వరల్డ్ వైడ్ క్రేజ్ ఎక్కువ. అవెంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్స్ ఇందుకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. అవతార్ రికార్డులని కూడా కొల్లగొట్టిన మార్వెల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈసారి ఏటర్నల్స్ అనే సూపర్ హీరోస్ రాబోతున్నారు. వరల్డ్ సినిమా షేక్ చేసిన ఈ అప్డేట్ లో ఎటర్నల్స్ టీజర్ కూడా ఉండడం విశేషం. 2 నిమిషాల టీజర్ లోనే ఆ మేకింగ్ స్టాండర్డ్స్, భారీ విజువల్ ఎఫెక్ట్స్, హ్యుజ్ ఫైట్ సీన్స్ ని చూపించిన మార్వెల్ ఈ ఎటర్నల్స్ ని నవంబర్ 2021న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ భారీ మూవీని అకాడెమీ అవార్డు విన్నర్ చోలే డైరెక్ట్ చేయగా, ఏంజిలినా సల్మా హయేక్ మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్నారు.