ఈసారి టైగర్ vs టైగర్

ఇండియాస్ మోస్ట్ సక్సస్ ఫుల్ సీక్వెల్స్ లిస్ట్ తీస్తే అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది టైగర్ సిరీస్. యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్, బాలీవుడ్ డీవా కత్రినా కైఫ్ కలిసి నటించిన ఈ సిరీస్ బాలీవుడ్ లోనే హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటి. 2012లో మొదటిసారి ఈ సిరీస్ నుంచి ఏక్ థా టైగర్ మూవీ రిలీజ్ అయ్యింది, కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సల్మాన్ ఇండియన్ రా ఏజెంట్ గా కత్రినా పాకిస్థాన్ ఏజెంట్ గా కనిపించారు. ఒక పర్ఫెక్ట్ స్పై థ్రిల్లర్ గా ఇండియన్ ఫిల్మ్ ఫ్యాన్స్ ని అలరించిన ఈ మూవీకి అయిదేళ్ల తర్వాత 2017లో టైగర్ జిందా హై మూవీ వచ్చింది. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. మొత్తంగా ఈ రెండు సినిమాలు కలిసి 899 కోట్లు కొల్లగొట్టి యాక్షన్ మూవీస్ లో సల్మాన్ రేంజ్ ఏంటో చూపించింది.

స్టైలిష్ టేకింగ్, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ, స్టార్ హీరో బాక్సాఫీస్ స్టామినా ఇవన్నీ కలిసి టైగర్ సిరీస్ ని స్పెషల్ గా మార్చాయి. ఇప్పటికే రెండు సినిమాలు వచ్చిన ఈ సిరీస్ నుంచి మూడో సినిమా కూడా రాబోతుంది. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీలో సల్మాన్ కి విలన్ గా మరో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ యాక్ట్ చేస్తున్నాడు. సల్మాన్ ఇండియన్ టైగర్ అయితే ఇమ్రాన్ హష్మీ పాకిస్థానీ ఐ.ఎస్.ఐ ఏజెంట్ గా కనిపించనున్నాడట. పాకిస్థాన్ టైగర్ గా, హైలీ ట్రైన్డ్ ప్రొఫెషనల్ ఏజెంట్ గా ఇమ్రాన్ హష్మీ రోల్ అద్భుతంగా ఉంటుందట. ఆన్ స్క్రీన్ ఈ ఇద్దరూ ఫైట్ చేస్తే చూడడానికి బాలీవుడ్ సినీ అభిమానులే కాదు ఇండియన్ మూవీ లవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ టైగర్ vs టైగర్ క్లాష్ చూడాలి అంటే 29 ఏప్రిల్ 2022 వరకూ ఆగాల్సింది.