రూలర్ కి రాజాకి పోటీ… ఆఖరి విజయం అందించేది ఎవరు?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ రూమర్ ఎలా మొదలవుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు. బాలయ్య, రవితేజకు మధ్య గొడవ అనే వివాదం కూడా ఇలాంటిదే. ఇద్దరు హీరోల మధ్య ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు కానీ ఎవరికి తోచింది వాళ్లు చెప్పుకుంటూ ఉంటారు. అయితే బాలయ్య రవితేజ మాత్రం ఈసారి నిజంగానే వార్ లో దిగుతున్నారు. ఈ ఇద్దరూ నటించిన సినిమాలు డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

nbk vs raviteja

ఇంకా టైటిల్ కూడా పెట్టని బాలయ్య #NBK105 క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకి రానుండగా, రవితేజ నటిస్తున్న డిస్కో రాజా అయిదు రోజుల ముందే డిసెంబర్ 20న థియేటర్స్ లో కనిపించనున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేం కానీ, ఈ పోటీ ట్రాక్ రికార్డ్ ఒక్కసారి చూస్తే రవితేజ… భద్ర కృష్ణ మిరపకాయ్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు వచ్చిన బాలయ్య… మహరధి ఒక్క మగాడు పరమవీర చక్ర సినిమాలు నిరాశ పరిచాయి. మరి ఈ ఏడాది లాస్ట్ హిట్ ఇచ్చేది ఎవరు? ఈ బాక్సాఫీస్ వార్ లో విజయం ఎవరిదో చూడాలి.