ఆ పాత్రల్లో అద్భుతంగా నటించే హీరో నందమూరి తారక రామారావు

ఈ జనరేషన్ హీరోల్లో పౌరాణిక పాత్రల్లో అద్భుతంగా నటించే హీరో ఎవరు అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు నందమూరి తారక రామారావు. యంగ్ టైగర్ గా పేరున్న ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో యముడిగా కనిపించి తెలుగు ప్రేక్షకులని మెప్పించాడు. తాతని గుర్తు చేసే డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో తారక్ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ తర్వత రామయ్య వస్తావయ్యా సినిమాలో కూడా ఎన్టీఆర్ పౌరాణిక డైలాగులు చెప్పి అలరించాడు. తాజాగా అల్లు అరవింద్ బాలీవుడ్ నిర్మాతలతో కలిసి రామాయణం సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం దాదాపు ఖాయమే కానీ ఏ పాత్రలో అనేది అందరికీ ఉన్న డౌట్.

jr ntr as ravana

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్ట్స్ నటించబోయే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఎన్టీఆర్ దశకంఠా రావణుడి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. రావణ పాత్రలేని రామాయణం ఊహించడం కష్టం, అలాంటి పాత్రని ఒక పాన్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్ లాంటి నటుడు చేయడం గొప్ప విషయం. అయితే ఎన్టీఆర్ రావణ పాత్రలో కనిపిస్తే మరి రాముడి పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఆ పాత్రలో హృతిక్ రోషన్ కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి కానీ ఈ రెండు విషయాలపైనా అఫీషియల్ గా ఎలాంటి క్లారిఫికేషన్ లేదు. రాముడు, రావణుడి పాత్రల్లో ఎవరు కనిపించినా సీతగా మాత్రం నయనతార నటించనుంది.