రజినీతో వార్ అంత ఈజీ కాదు సూర్య

సూర్యకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది, దర్శకుడు శివ కూడా తెలుగులో మంచి హిట్స్ అందుకున్నాడు. ఈ ఇద్దరి నుంచి సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి బజ్ ఉంటుంది. అయితే సంక్రాంతి సందర్భంగా తెలుగులో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటి మధ్యలో సూర్య తన సినిమాని రిలీజ్ చేసే డేర్ చేస్తాడా అనే డౌట్ ఉంది, తెలుగులో మాత్రమే కాదు తమిళ్ లో కూడా సూర్య సంక్రాంతి రాకకి సూపర్ స్టార్ రజినీకాంత్ అడ్డుపడుతున్నాడు. రజినీ, మురుగదాస్ కలయికలో వస్తున్న దర్బార్ సినిమా కూడా సంక్రాంతి కనుకగానే ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ ఏడాది సంక్రాంతికి పేట మూవీకి పోటీగా వచ్చిన విశ్వాసం, పేట ఉన్నా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇదే రికార్డ్ ని కంటిన్యూ చేస్తూ శివ, సూర్య39 సినిమాని కూడా రజినీకి పోటీగా నిలబెట్టాలనుకుంటున్నాడట. అయితే పేట పరిస్థితి వేరు, కథతో సంబంధం లేకుండా కేవలం రజినీ చరిష్మా మీదే తెరకెక్కిన సినిమా అది కానీ దర్బార్ అలా కాదు. మురుగదాస్ లాంటి పక్కా కమర్షియల్ డైరెక్టర్, రజినీని టు షేడ్స్ లో చూపిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. పోలీస్ గా రజినీకాంత్ బాక్సాఫీస్ ని దున్నేస్తాడని ట్రేడ్ వర్గాలు ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నాయి. దర్బార్ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో వర్కింగ్ స్టిల్స్ చేస్తున్న హంగామా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే సూర్య నటించిన బందోబస్త్ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు కాబట్టి సూర్యకి అర్జెంటుగా హిట్ కావాలి. సో, ఇలాంటి సమయంలో రజినీ దర్బార్ మ్యానియా ముందు సూర్య తన సినిమాని నిలబెడతాడా? అంటే అంత డేర్ చేసే అవకాశం లేదనిపిస్తోంది.