‘నరుడి బ్రతుకు నటన’ ఫస్ట్ లుక్ – గ్లింప్స్ విడుదల

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ముందుంటున్నదే విష్యం అందరికి తెలిసిందే. అయితే అదే క్రమంలో నరుడి బ్రతుకు నటన అనే సినిమాని మన ముందుకు తీసుకుని రాబోతున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.
ఈ సినిమా పూర్తిగా కేరళలో షూటింగ్ చేయడం జరిగింది. కేరళ అందాలను కళ్ళకు కట్టినట్లు రిషికేశ్వర్ యోగి తెరకెక్కిస్తున్నారు. శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ తదితరులు ముఖ్యపాత్రాలలో నటిస్తుండగా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ గారు, సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూఛిబొట్ల గారు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకుండానే సుమారు 60 కి పైగా అవార్డులు గెలుచుకుంది.
సినిమా ఈ నెల 26న భారీగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.