ఏడేళ్ల తర్వాత నాని సమంతాలని ఆ డైరెక్టర్ కలుపుతాడా?

నాని నటించిన నిన్ను కోరి సినిమా ప్రేమ తర్వాత ఉండే జీవితాన్ని చూపిస్తే, సామ్ చై కలిసి నటించిన మజిలీ మూవీ పెళ్లి తర్వాత ప్రేమని చూపించింది. క్లీన్ హిట్స్ గా నిలిచిన ఈ సినిమాలని అద్భుతంగా డైరెక్ట్ చేసిన ఘనత శివ నిర్వాణాకే దక్కుతుంది. సెన్సిబుల్ పాయింట్స్ ని తీసుకోని బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేసే శివ నిర్వాణ, మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మొదటి సినిమా హీరో, రెండో సినిమా హీరోయిన్ ని కలుపుతూ శివ ప్లాన్ చేసిన ఈ మూవీ మరో లవ్ స్టోరీ అని తెలుస్తోంది.

నాని సమంతలు ఇప్పటికే ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు లాంటి రెండు హిట్ సినిమాలు ఇచ్చారు. ఈ చిత్రాల్లో నాని, సామ్ మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది. ఈ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ కాబోతోంది. ప్రస్తుతం సమంత 96 రీమేక్ లో నటిస్తుండగా, నాని ‘V’లో యాక్ట్ చేస్తున్నాడు. లీడ్ పెయిర్ కి ఉన్న ఈ కమిట్మెంట్స్ అయ్యాక, శివ నిర్వాణ సినిమా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.