శ్రీవిష్ణు తిప్పరా మీసం సెన్సార్ కంప్లీట్… క్లీన్ క్రైమ్ థ్రిల్లర్

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని మాత్రమే చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు. ఇప్పుడు అతని నుంచి ఒక సినిమా బయటకి వస్తుంది అంటే అందులో తప్పకుండా విషయం ఉంటుంది అనే నమ్మకం సినీ అభిమానుల్లో కలిగించాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్న శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ సినిమా తిప్పరా మీసం. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

అసుర ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్ట్ చేసిన తిప్పరా మీసం సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులని ఏషియన్ సినిమాస్ సొంతం చేసుకుంది. తిప్పరా మీసం సినిమాలో అండర్ వాటర్ లో తీసిన సీన్ సినిమాకే హైలైట్ గా ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి వారి నమ్మకాన్ని తిప్పరా మీసం సినిమా ఎంత వరకూ నిలబెట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.