అల్లు అర్జున్ ‘ఐకాన్’ కనిపించట్లేదు… ఆగిపోలేదు, కానీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `అల‌..వైకుంఠ‌పుర‌ములో..` సినిమా చేస్తున్నాడు. ఇది అయ్యాక సుకుమార్ తో చేయనున్న బన్నీ, రీసెంట్ గా ఈ మూవీలో గ్రాండ్ గా లాంచ్ కూడా చేశాడు. అయితే సుకుమార్ మూవీతో పాటు దిల్‌రాజు బ్యానర్ లో ఒక సినిమాని సైన్ చేసిన బన్నీ, ఇప్పుడు దాన్ని ఆపేసినట్లున్నాడు. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కాల్సిన ఈ మూవీ ఆగిపోయిందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

icon allu arjun

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు అనే వార్త బయటకి రాగానే, ఐకాన్ ఆగిపోయింది అనే న్యూస్ కన్ఫామ్ అయ్యింది. అయితే అది తాత్కాలికంగా వాయిదా పడిందా లేక పూర్తిగా ఆగిపోయి అటకెక్కిందా అనే విషయం తెలియాల్సి ఉంది. దిల్ రాజు, అల్లు అర్జున్ ల నుంచి అఫీషియల్ అన్నౌసెమెంట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది అనే స్టేట్మెంట్ బయటకి రాలేదు కాబట్టి, ఐకాన్ సినిమా మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బన్నీ సుకుమార్ సినిమా అయ్యేలోపు, శ్రీరామ్ వేణు పవన్ కళ్యాణ్ సినిమా కూడా అయిపోతుంది కాబట్టి… ప్రస్తుతం వీరికి ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ కాగానే ఐకాన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.