ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సైన్స్ ఫిక్ష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌

bombhaat movie poster

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా.. రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌న్నూర్‌క‌ర్ నిర్మిస్తున్న సైన్స్ ఫిక్ష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `బొంభాట్`‌ అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. రీసెంట్‌గా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.


ఈ సంద‌ర్భంగా పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ – “యంగ్ బ్ల‌డ్ క‌లిసి చేసిన `బొంభాట్` ఫ‌స్ట్ లుక్‌ బావుంది. సుశాంత్, సిమ్రాన్‌, చాందిని, మ‌క‌రంద్ దేశ్ పాండే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జోష్.బి నాకు మంచి స్నేహితుడు. త‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా సంగీత సారథ్యం వహించారు. త్వరలో పాటలు మార్కెట్ లోకి రాబోతున్నాయి. ఈ సినిమా క‌లెక్ష‌న్స్‌తో బొంభాట్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు