హైదరాబాద్ లో ఘర్జిస్తున్న నందమూరి నట సింహం

బాలయ్య బాబు మాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసిన సినిమాలు సింహ, లెజెండ్. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. హిట్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన ఈ కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో సినిమా అఖండ. అఘోరాగా బాలయ్య నటిస్తున్న ఈ మూవీ టైటిల్ రోర్ ని ఏప్రిల్ 13న రిలీజ్ చేశారు. అతితక్కువ కాలంలోనే 54 మిలియన్ వ్యూస్ రాబట్టిన అఖండ మూవీ నందమూరి అభిమానుల్లోనే కాక సినీ అభిమానుల్లో కూడా అంచనాలు పెంచింది. సీనియర్ హీరో సినిమాల్లో 50 మిలియన్ టచ్ చేసిన ఏకైక టీజర్ అఖండ మాత్రమే. పుష్ప తర్వాత తెలుగు టాప్ వ్యూవర్ షిప్ సాధించిన ఈ టీజర్ ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శ్రీకాంత్​ విలన్​గా నటిస్తుండగా… ప్రగ్యాజైస్వాల్​, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మే 28న ప్రేక్షకుల ముందుకి రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో బాలయ్య, బోయపాటిలు మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. హైదరాబాద్ లో మొదలైన ఈ షెడ్యూల్ తో అఖండ షూటింగ్ కంప్లీట్ అవనుంది. యాక్షన్ పార్ట్ షూటింగ్ జరుగుతున్న ఈ షెడ్యూల్ నుంచి మేకర్స్ వదిలిన పోస్టర్ లో బాలయ్య అఘోరా గెటప్ లో ఉన్నాడు, బోయపాటి శ్రీను ఎదో సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వీలైనంత త్వరగా అఖండ షూటింగ్ ని కంప్లీట్ చేసి నందమూరి అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి బాలయ్య బోయపాటి కాంబినేషన్ రెడీ అవుతోంది.