OTT లోకి వెంకటేష్ నారప్ప… అఫీషియల్ న్యూస్ వచ్చేసింది

విక్టరీ వెంకటేష్ ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం నారప్ప. కోలీవుడ్ లో ధనుష్ నటించి సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకి ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ విశేషంగా ఆకట్టుకోగా, ఇటివలే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా చలాకీ చిన్నమ్మాయి అనే పాటని కూడా రిలీజ్ చేశారు. ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది. థియేటర్స్ ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడంతో నారప్ప సినిమాని అమెజాన్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో జూలై 20 నుంచి ప్రీమియర్ కానుంది. పోస్ట్ కరోనా డైరెక్ట్ గా ఒటిటిలోకి వచ్చిన పెద్ద సినిమా నారప్పనే కావడం విశేషం. కరోనా తగ్గి థియేటర్స్ ఓపెన్ చేయమని ప్రభుత్వాలు చెప్పినా కూడా ధియేటర్ యాజమాన్యాలు అందుకు సిద్ధంగా కనిపించట్లేదు. ప్రేక్షకులు ధియేటర్ కి వస్తారా? కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందా? టికెట్ రేట్స్ పరిస్థితి ఏంటి? ఇలా రకరకాల కారణంగా థియేటర్స్ తెరుచుకోలేదు. దీంతో నారప్ప యూనిట్ ఒటిటి వైపు వెళ్లారు. ఎక్సిబిటర్లు సినిమాలని ఒటిటిలకి అమ్ముకోకండి, అక్టోబర్ వరకూ ఆగండి అంటూ ఇటివలే నిర్మాతలకి విన్నవించుకున్నారు. ఇప్పుడు బడా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన సురేష్ బాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది.