కన్న తల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని…

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం అయ్యి ఈ జూన్ 22 నాటికి 21 సంవత్సరాలు అయ్యింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు చేతులమీదుగా శంకుస్థాపన జరిగిన ఈ హాస్పిటల్ దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి చేతుల మీదుగా ప్రారంభమైంది. బాలకృష్ణ తల్లి బసవతారకం క్యాన్సర్ కారణంగా చనిపోయిన నేపథ్యంలో అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఈ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ అనే దానిని 1988 లో స్థాపించారు. అయితే ఆయన చనిపోయిన చాన్నాళ్ల తర్వాత ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అమెరికా వారి సహకారంతో బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇండియా జూన్ 22 2000వ సంవత్సరంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించింది. అప్పటి ప్రధానమంత్రి హోదాలో అటల్ బిహారీ వాజ్పేయి ఈ హాస్పిటల్ ను లాంచనంగా ప్రారంభించారు.

అప్పటి నుంచి క్యాన్సర్ వైద్యంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ ఈ హాస్పిటల్ ఇప్పటికే రెండు దశాబ్దాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు 21వ వార్షికోత్సవం కూడా పూర్తి చేసుకుంది. భార్య మీద ఉన్న ప్రేమతో ఎన్టీఆర్ ఒక ఫౌండేషన్ స్థాపించగా దానిని ఎక్కడ పట్టు విడవకుండా తల్లి మీద ఉన్న ప్రేమతో బాలకృష్ణ తన తల్లి లాగా ఇంకా ఏ తల్లి బాధ పడకూడదు అని భావిస్తూ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించేలా చేశారు. ఇక ఇదే సమయంలో బాలకృష్ణ కూడా ఇన్స్టిట్యూట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ హోదా చేపట్టి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ 21వ ఫౌండేషన్ డే సంధర్భంగా సోషల్ మీడియాలో తన ఫీలింగ్స్ ని బాలకృష్ణ షేర్ చేసుకున్నారు. బోర్డు మెంబర్స్ తరపున హాస్పిటల్ టీంని బాలకృష్ణ అభినందించారు. ఈ క్యాన్సర్ హాస్పిటల్ కు బాలకృష్ణ చేస్తున్న సేవ ద్వారా ఎన్నో ప్రాణాలు నిలబడ్డాయి. ఈ విషయంలో బాలకృష్ణను అభినందించకుండా ఉండలేము. ఎన్నేళ్లు గడిచినా ఈ హాస్పిటల్ ఇలానే ప్రజలకి అండగా నిలవాలని కోరుకుందాం.