ఖిలాడీ లాస్ట్ షెడ్యూల్ మొదలవ్వనుంది

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ మూవీతో సాలిడ్ హిట్ ఇచ్చాడు. ఇదే జోష్ లో తన నెక్స్ట్ సినిమా ఖిలాడీని మొదలుపెట్టిన రవితేజ జెట్ స్పీడ్ లో షూటింగ్ చేశాడు. రాక్షసుడు సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు , కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు.

కరోనా సెకండ్ వేవ్ లో కేసులు పెరుగుతున్న కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి చిత్ర యూనిట్ ఇటలీ నుండి ఇండియాకు వచ్చేశారు. ఒక సాంగ్ , ఒక యాక్షన్ సీన్ బ్యాలెన్స్ ఉన్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ని తిరిగి ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో లాస్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసి బాలన్స్ ఉన్న పార్ట్ ని కంప్లీట్ చేయనున్నారు. ఓటిటీ నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా మేకర్స్ మాత్రం క్రాక్ మూవీలాగే ఖిలాడీని కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చేసి హిట్ కొట్టాలని భావిస్తున్నారట. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన ఖిలాడీ టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.