అక్కడ ఇంకా ఎక్కువ సంపాదిస్తా…

ఒక సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో దానికి పని చేసే వారిలో ఉండే కాన్ఫిడెన్స్ లో కనిపిస్తుంది. ఇదే కొలమానంగా చేసుకోని రౌడీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా లైగర్ రిజల్ట్ గురించి చెప్పాలి అంటే బాక్సాఫీస్ ని లిగర్ మూవీ రఫ్ఫాడించడం ఖాయం. దాదాపు 125 కోట్ల బడ్జట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీతో అనన్య పాండే తెలుగు తెరపై మెరవనుంది. పూరి మేకింగ్ స్టాండర్డ్స్ కి బాలీవుడ్ బిగ్గీ కరణ్ జోహార్ కూడా తోడవడంతో మొత్తం ఇండియన్ సినీ పరిశ్రమలో లిగర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ అండ్ మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న లిగర్ మూవీకి ఒక ఓటీటీ సంస్థ నుంచి అన్ని భాషల స్ట్రీమింగ్ రైట్స్ కోసం దాదాపు 200 కోట్ల ఆఫర్ చేశారనే వార్త ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది. ఈ విషయంపై డైరెక్ట్ హీరో విజయ్ దేవరకొండ తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చాడు. 200 కోట్లా అది చాలా తక్కువ, థియేటర్లలో అంతకుమించి వసూళ్లు చేస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. విజయ్ ఇచ్చిన ఆన్సర్ లో లిగర్ పై ఉన్న కాన్ఫిడెన్స్ ని చూపించింది. దీంతో ఈ క్రాస్ బ్రీడ్ సాలా, లిగర్ కేవలం థియేటర్స్ లోనే విడుదల అవుతుంది అని కన్ఫర్మ్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ అయిపోవడంతో పూరి లిగర్ షూటింగ్ ని మళ్లీ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు.