నాట్యం చేసిన నెమలికి యూట్యూబ్ రికార్డ్స్ దాసోహం

డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో.. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా ల‌వ్‌స్టోరి చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలోని సారంగ‌ద‌రియా అనే సాంగ్‌ను రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను, సంగీత ప్రియుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. ఈ సాంగ్‌ను ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించ‌గా.. మంగ్లీ ఆల‌పించింది. ఈ సాంగ్‌కు టాలెంట‌డ్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి డ్యాన్స్ చేసి ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రించింది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో మార్మోగిపోతుంది.. ఈ నేప‌థ్యంలో ఈ సాంగ్ తాజాగా మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో విడుద‌లైన 32రోజుల్లోనే 100మిలియ‌న్ వ్యూస్ సాధించిన ఈ సాంగ్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 28న విడుదలైన సారంగ దరియా సాంగ్ 250 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.

ఓ తెలుగు పాట ఇంత త్వ‌ర‌గా ఈ రికార్డును సాధించ‌డం చాలా అరుదైన విష‌యం.. ఈ సాంగ్‌ను ప‌వ‌న్ సీహెచ్‌క కంపోజ్ చేయ‌గా.. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో సాయిప‌ల్ల‌వి ఓ ర‌కంగా నెమ‌లిలా నాట్యం చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గింది కాబట్టి థియేటర్స్ ఓపెన్ అయితే లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్దమవుతు ఉంది.