న్యూ ట్యాలెంట్ ని ప్రోత్సహించడం కోసం ‘నక్కిన నరేటివ్స్’ బ్యానర్ ని ప్రారంభించిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన  

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చిత్ర పరిశ్రమలో న్యూ ట్యాలెంట్, న్యూ కమ్మర్స్ ని ప్రోత్సహించడం కోసం ‘నక్కిన నరేటివ్స్’ పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు. మంచి కథతో ఈ బ్యానర్ లో రాబోయే తొలి చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది.  

”న్యూ ఏజ్ కంటెంట్, ట్యాలెంట్, కొత్త కథలని ప్రోత్సహించడం కోసం స్థాపించిన బ్యానర్ ఇది. మంచి యంగ్ ట్యాలెంట్ వున్న వారితో ఓ సినిమాని చేశాం. షూటింగ్ పూర్తి కావచ్చింది. తర్వలోనే టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తాం” అని దర్శకుడు త్రినాథరావు నక్కిన తెలిపారు.