Tollywood: నాగార్జున ‘వైల్డ్‌డాగ్’ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన‌ మెగాస్టార్‌!

Tollywood: టాలీవుడ్ కింగ్ నాగార్జ‌న న‌టించిన తాజా చిత్రం వైల్డ్‌డాగ్‌. ఈ చిత్రంతో అహిషోర్ సాల్మోన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ Tollywood చిత్ర ట్రైల‌ర్‌ను చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. ఈ మేర‌కు Tollywood మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా వైల్డ్‌డాగ్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి ట్విట్ట‌ర్ ద్వారా తెలుపుతూ..

nag movie

నా సోద‌రుడు నాగ్ ఇందులో ఎప్ప‌టిలాగే చాలా కూల్‌గా.. ఎన‌ర్జిటిక్‌గా క‌నిపించారు. ఏ జోన‌ర్ సినిమా అయినా చేయ‌డానికైనా భ‌యం లేకుండా ముంద‌డుగు వేసే న‌టుడు అత‌ను. వైల్డ్‌డాగ్ చిత్ర‌యూనిట్‌కు, మా నిర్మాత నిరంజన్‌రెడ్డికి శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు చిరంజీవి. ఈ చిత్రంలో నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజేన్సీ ఏజెంట్ విజ‌య్ వ‌ర్మగా నాగార్జున క‌నిపించ‌నున్నారు. ఇక ఇందులో స‌యామీ ఖేర్‌, అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్ మాథ్య‌స్‌, రుద్రా గౌడ్‌, హ‌ష్వంత్ మ‌నోహ‌ర్ త‌దిత‌రులు న‌టించిన ఈTollywood చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందించారు.