Tollywood: ప‌వ‌ర్‌స్టార్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్‌ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ న‌భా..

Tollywood: ఇస్మార్ట్ శంక‌ర్‌లో హాట్ హాట్ అందాల‌ను చూపిస్తూ కుర్ర‌కారును న‌షా ఎక్కించేలా చేసిన యంగ్ బ్యూటీ న‌భా న‌టేష్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాన్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్ చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. న‌న్ను దోచుకుందువ‌టే సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై ఎంతో గుర్తింపు తెచ్చుకుంది న‌భా. ఆ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్వ‌క‌త్వంలో రామ్‌కు జోడీగా ఇస్మార్ట్ శంక‌ర్‌లో న‌టించింది న‌భా. అనంత‌రం ర‌వితేజ డిస్కోరాజా, సాయితేజ సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, బెల్లంకొండ శ్రీ‌నివాస్ అల్లుడు అదుర్స్ చిత్రాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది న‌భా. మ‌రోవైపు త‌న హాట్ హాట్ ఫోటోల‌తో సోష‌ల్ మీడియాలో కూడా రెచ్చిపోతుంది.

Powerstar Nabha natesh

ఇకTollywood ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురించి తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలుపుతూ.. ప‌వ‌ర్‌స్టార్ అంటేనే అభిమానుల సునామీ అని అభివ‌ర్ణించింది. ఇక ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం నితిన్ హీరోగా తెర‌కెక్కుతున్న అంధాదున్ రీమేక్‌.. ఈ సినిమా జూన్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. త‌ప్ప‌కుండా అంద‌రూ వీక్షించండి అంటూ చెప్పుకొచ్చింద ఇస్మార్ట్ బ్యూటీ న‌భా న‌టేష్Tollywood‌.