మోనాల్‌కి బాలీవుడ్ ఆఫర్స్?

తెలుగు బిగ్‌బాస్ 4లో పాల్గొనడంతో పాపులర్ అయిన గుజరాతీ భామ మోనాల్.. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌లో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ స్టెప్పులతో దుమ్ములేపింది. అంతకుముందు తెలుగు నాలుగైదు సినిమాల్లో మోనాల్ నటించినా.. అంతగా ఎవరికీ తెలియదు. కానీ బిగ్‌బాస్‌లో ఏడుపులతో, అఖిల్, అభిజిత్‌తో లవ్ ట్రాక్ నడిపి ఫేమస్ అయింది. బిగ్‌బాస్ తర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

monal offers in bollywood

బాలీవుడ్‌ నుంచి కూడా ఈ గుజరాతీ ముద్దుగుమ్మకు ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల మోనాల్ నటించిన బాలీవుడ్ సినిమా కాగజ్ జీ5లో విడుదలై విజయం సాధించింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాను నిర్మించగా.. సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా హిట్ కావడంతో.. మోనాల్‌కి బాలీవుడ్‌లో ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయి. త్వరలో తన బాలీవుడ్ ఆఫర్స్ గురించి ప్రకటిస్తానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మోనాల్ చెప్పింది.