రామ్ పోతినేని నెక్స్ట్ సినిమాలో ముంబై హాట్ బ్యూటీ…

సోగ్గాడే చిన్నినాయనా సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన సినిమా నెల టికెట్ చేశాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో ముంబై చిన్నది మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమానే రవితేజ పక్కన నటించే అవకాశం రావడంతో మాళవిక కెరీర్ జెట్ స్పీడ్ అందుకుంటుంది అనుకున్నారు. నెల టికెట్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మాళవిక కెరీర్ కి తెలుగులో కష్టాలు మొదలయ్యాయి. ఫస్ట్ సినిమానే అవడంతో మాళవికని దర్శక నిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఏడాదిన్నరగా కాలిగా ఉన్న మాళవికకి ఇప్పుడు ఒక క్రేజీ ఆఫర్ దొరికింది.

malavika ram pothineni

మోడల్లింగ్ చేస్తూనే లా చదివిన మాళవిక శర్మ సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు కిక్ ఇస్తూనే ఉంటుంది. అయితే మాళవిక శర్మకి వచ్చిన కొత్త సినిమా ఆఫర్ రామ్ పోతినేని సినిమా కావడం విశేషం. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రామ్, కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్. అరుణ్ విజయ్ హీరోగా వచ్చిన త‌మిళ చిత్రం త‌డం సినిమాకు రీమేక్‌ గా ఈ మూవీ రాబోతోంది. ఈ ఏడాది తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఒకటైన తడం, రామ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ మార్పులు చేసే పనిలో దర్శకుడు ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం త్వ‌ర‌లోనే రానుంది.